పెళ్లికి నిరాకరించిందని తల నరికేశాడు!
Published on: Wed Jan 28, 2026 8:55AM
.webp)
పెళ్లికి నిరాకరించిందని ప్రియురాల తలనరికేసిన ప్రేమోన్మాది ఉదంతమిది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఓ ప్రైవేటు కంపెనీలో అక్కౌంటెంట్ గా పని చేస్తున్న వినయ్ సింగ్, అదే కంపెనీలో హెచ్ఆర్ మేనేజన్ గా పని చేస్తున్న మింకీ శర్మలు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వినయ్ సింగ్ పెళ్లి ప్రతిపాదనను మింకీ శర్మ తిరస్కరించడంతో కోపం పెంచుకున్న వినయ్ సింగ్ మింకీ శర్మను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జనవరి 23న మింకీ శర్మను ఆఫీసులోనే కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
అనంతరం ఆమె తలను మొండెం నుంచీ వేరు చేసి తలను ఓ బ్యాగులో, మొండెం, కాళ్లను మరో గోనె సంచిలో కుక్కాడు. మృతదేహాన్ని యమునా నదిలో పడేసేందుకు మింకీ స్కూటర్‌పైనే జవహర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అయితే గోనెసంచి బరువుగా ఉండటంతో దానిని అక్కడే వదిలేసి, తలను మాత్రం సమీపంలోని ఓ కాలువలో పడేసి పారిపోయాడు. కేసును ఛేదించి నిందితుడు వినయ్ సింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని, స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మింకీ తల కోసం గాలిస్తున్నారు.


