Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
posted on: Sep 2, 2025 2:20PM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. హరీష్ రావు, సంతోష్ సహా పార్టీ నేతలపై చేసిన విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో బీఅర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ లది కీలక పాత్ర అని కవిత సోమవారం (సెప్టెంబర్ 1)న మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరం అవకతవకలపై విచారణ సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వారి తప్పులకు తన తండ్రి చిక్కుల్లో పడ్డారంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఇటీవల కొంత కాలంగా ఆమె పార్టీ లైన్ కు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం (సెప్టెంబర్ 2) ఆమెను సస్పెండ్ చేసింది.






