Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పైలట్ రోహిత్ రెడ్డి కి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు
posted on: Mar 17, 2026 1:22PM

హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ సంతకంతో.... బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన ఈ నోటీసులో వారం రోజులలో పైలట్ రోహిత్ రెడ్డి తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణ లపై పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, ఈ విషయంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు. బీఆర్ఎస్ బాధ్యతా యుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలను పాటిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం వంటి అక్రమ కార్యకలాపా లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ షోకాజ్ నోటీసు పేర్కొంది.
పైలట్ రోహిత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా భావించి కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, నోటీసులో పేర్కొన్న గడువులోపు సంతృప్తికర మైన వివరణ ఇవ్వకపోతే.. ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుం టామని కూడా పైలట్ రోహిత్ రెడ్డిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి తనకు అందిన షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ, ఆ పై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.



.webp)


