TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలపై హరీష్ రావు క్లారిటీ.. కేటీఆర్‌‌ బాధ్యతలుపై కీలక వ్యాఖ్యలు

Published on: Tue May 13, 2025 6:24PM

 

బీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాని ఆయన పేర్కొన్నారు. గులాబీ బాస్  తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను, ఆయన ఆదేశాలను పాటిస్తానని అన్నారు. రాముడికి హనుమంతుడిలాగా కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట అని పార్టీలో విభేదాలను పుల్ స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక  చేతులు ఎత్తేసిందని అన్నారు. సీఎం రేవంత్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ పరిస్థితి పాకిస్థాన్‌ కంటే దారుణంగా ఉందని ఆయన అన్నారు. పాక్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు. కానీ రేవంత్‌ను నమ్మి అప్పు ఇవ్వడం లేదని హారీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించడం చేతకావడం లేదని విమర్శించారు