TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖాళీ అయ్యే బాటలో కేసీఆర్ పార్టీ.. మరో ఎమ్మెల్యే జంప్!

Published on: Sun Jun 23, 2024 11:51PM

కేసీఆర్ పార్టీ ఖాళీ అయ్యే దిశగా చాలా వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రెండ్రోజుల క్రితం క్రాంగెస్‌లో చేరి కేసీఆర్ కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఆ కుటుంబం ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే మరో షాక్ తగిలింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం నాడు సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. సంజయ్‌కి రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరబోయే తదుపరి ఎమ్మెల్యే ఎవరో?