TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 మహబూబాబాద్ లో  నేడు బిఆర్ ఎస్ మహాధర్నా...ప్లెక్సీల రగడతో టెన్షన్ 

Published on: Mon Nov 25, 2024 9:45AM

లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్   సోమవారం  మహబూబాబాద్ లో మహాధర్నాకు  పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.   ప్లెక్సీ రగడతో జిల్లాలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది.
కెటీఆర్ ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.  లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్ దళితులు, గిరిజనుల హక్కుల కాపాడటానికి మహబూబాబాద్ లో మహాధర్నా కార్యక్రమానికి  పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ప్లెక్సీలను జిల్లా వ్యాప్తంగా అంటించారు. ఈ ప్లెక్సీలను నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ఇది  కాంగ్రెస్ పనేనని బిఆర్ఎస్  ఆరోపిస్తుంది. బిఆర్ ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.