TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్‌ఎస్‌ ఫైర్ బ్రాండ్ మల్లారెడ్డి కారు దిగేస్తున్నారా?

Published on: Mon Jul 6, 2026 2:26PM

తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు... విలక్షణ శైలి, వినూత్న వాగ్ధాటితో నిత్యం వార్తల్లో ఉండే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఛామకూర మల్లారెడ్డి కారు దిగేస్తున్నారా?  రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే.. తాజా రాజకీయ పరిణామాలను గమనించిన వారు ఔననే అంటున్నారు.  

 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి  ఓటమి పాలైనప్పటి నుండి, ఆ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికి, క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ..  సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పుడా బాటలో చామకూర మల్లారెడ్డి కూడా నడుస్తున్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల    ఒక   వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి..  తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు. తాను బీఆర్ఎస్ కు దూరం జరగడం ప్రారంభించి కొన్ని రోజులే  అయినప్పటికీ.. అప్పుడే.. తన మద్దతుదారులు తనను ఏకాకిని చేసేయడం మొదలెట్టారనీ మల్లారెడ్డి ఒకింత భావోద్వేగ స్వరంతో చెప్పారు. ఆయన భావోద్వేగాలు, ఆవేదన కాసేపు పక్కన పెడితే.. మల్లారెడ్డి మాటలను బట్టే ఆయన బీఆర్ఎస్ కు దూరమౌతున్నారని అవగతమౌతోంది. ఆయన కారు దిగేయడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 ఆయన చెప్పడం సరే.. వాస్తవానికి గత కొంత కాలంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకూ, సమావేశాలకూ ఆయన గైర్హాజరౌతున్నారు. దీంతో మల్లారెడ్డి స్వయంగా తాను బీఆర్ఎస్ కు దూరం అవుతున్నానని చెప్పడానికి చాలా రోజుల ముందు నేంచే మల్లారెడ్డి పార్టీ మార్పుపై రాజకీయవర్గాలలో చర్చ జోరందుకుంది.  ఇక ఇప్పుడు ఆయన స్వయంగా పార్టీకి దూరం అవుతున్నానని బహిరంగంగానే చెప్పేయడంతో ఆయన ఏ పార్టీ గూటికి చేరుతారన్న ఆసక్తికర చర్చ మొదలైంది. 

ఈ నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు దాదాపు మృగ్యమనీ, చేరితే గీరితే ఆయన కాషాయం గూటికే చేరాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా గత కొంత కాలంగా ఆయన బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, వారితో టచ్ లో ఉంటున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  

BRS Party, Telangana Politics, Revanth Reddy, BJP Telangana, Malla Reddy Leaving BRS, Teluguone