TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్

Published on: Sat Feb 14, 2026 9:22AM

కొత్తగూడెంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. మునిసిపల్ కార్పొరేషన్  ఎన్నికల ఫలితాలువెలువడిన గంటల్లోనే  బీఆర్ఎస్ కొర్పొరేట్ కిడ్నాప్ వార్తలు కలకలం రేపాయి. కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. హంగ్ ఏర్పడింది. 
డమేయర్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన  మెజారిటీ ఏ పార్టీకీ రాకపోవడంతో  అన్ని పార్టీలూ తమతమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ తరుణంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్ అయ్యారన్న వార్తలు వెలువడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీఆఱ్ఎస్ ఆరోపిస్తున్నది.  32వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన గుగులోతు రాంబాబు కిడ్నాప్ నకు గురయ్యారనీ,  కాంగ్రెస్ నాయకులే రాంబాబును బలవంతంగా తీసుకెళ్లారని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

60 స్థానాలున్న కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే కనీసం 31 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. తాజా ఫలితాలలో  కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ 8, స్వతంత్రులు 6, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. దీంతో హంగ్ ఏర్పడింది. మేయర్ ఎన్నిక సోమవారం (ఫిబ్రవరి 16) జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమతమ కార్పొరేటర్లను రహస్య ప్రాంతాలలో క్యాంపులకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి సీపీఐకి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అదృశ్యం కలకలం రేపింది.