చెల్లి పై అన్న దారుణం.. రోకలి బండతో అన్నను చంపిన చెల్లి..
Published on: Fri Jun 11, 2021 11:40AM
ఒకడు పరాయి అమ్మాయి తన అనుమతి లేకుండా తాకడం నేరం.. అదే ఒక ఇంట్లో వాళ్ళు .. ఒక్క తల్లి కడుపునా పుట్టిన వాళ్ళు, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు.. ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు.. పెద్దయ్యాక మందు తాగి ముందు వెనక చూడకుండా సొంత వాళ్లపై అత్యాచారానికి పాల్పడితే.. దాని ఏం అనాలి.. వాడు ఏ జాతికి చెందిన మనిషి అనాలి.. సొంత చెల్లి మీద అత్యాచారం ఎవరు చేస్తారు భయ్యా.. వేరే ఎక్కడైనా చెయ్యొచ్చు కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తారా అని మీరు అనుకోవచ్చు.. ఈ సంఘటన జరిగింది మన అది ఎక్కడో తెలుసుకోవాలనుకున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం..
అది తెలంగాణ రాష్ట్రము కరీంనగర్ జిల్లా. విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా తాగాడు.. తూలుతు ఇంటికి వచ్చాడు. తాగిన మత్తులో ఇంటికి రాగానే ఎదురుగా తన చెల్లి కనిపించింది. ఇక అంటే వాడికి కామం ముంచుకొచ్చింది.. వావివరసలు మరిచి.. చెల్లెల్ని వంచించాలని ఆమె మీదికి విరుచుకుపడ్డాడు.. చెల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంత వద్దని చెప్పిన వినలేదు ఆ దుర్మార్గుడు. ఈ క్రమంలోనే తనను తాను కాపాడుకునేందుకు దగ్గరిలో ఉన్న రోకలిబండను అన్న మీదకు విసిరేసింది ఆ చెల్లెలు.. దీంతో అతను అక్కడికక్కడే కూలిపోయాడు..మృతి చెందాడు. అయితే మద్యానికి బానిసైన అన్న తనను రోజు వేధించడం వలనే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపింది. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తగినంత మాత్రానా తల్లి పెళ్ళాం అయితదా.. పెళ్ళాం తల్లి అయితదా.. చెల్లెలిపై అత్యాచారం చేయాలనుకోవడం అమ్మను ఆలిగా చేసుకోవడం లాంటిదే.. ఈ దారుణానికి పాల్పడ్డ అన్నపై చెల్లెలు సరైన నిర్ణయమే తీసుకుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు..


