బ్రదర్‌ అనీల్‌కు హైకోర్టు నోటీసులు

Publish Date:Nov 5, 2013

Advertisement

 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బావ బ్రదర్‌ అనీల్‌కుమార్‌కు రాష్ట్ర అత్యున్నత నాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో అనిల్ పేరును చార్జిషీట్ నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

ఈ పిటీషన్‌ పై స్పందించిన న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని బ్రదర్‌ అనీల్‌ను కోర్టు ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలో బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సభలు నిర్వహించారని ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది.

By
en-us Political News