Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హీరోయిన్ మాజీ లవర్ హత్య
posted on: Jan 19, 2015 1:30PM

హాలీవుడ్ హీరోయిన్ బ్రిట్నీ స్పియర్ మాజీ లవర్ హత్యకు గురయ్యాడు. బిట్నీ స్పియర్ చాలాకాలం ప్రేమాయణం నడిపిన జాన్ సందాల్ వృత్తిరీత్యా పైలెట్. బ్రిట్నీతో ప్రేమాయణం నడిపినంతకాలం ఆమె చుట్టూ తిరిగిన జాన్ సందాల్ ఆమెకు దూరమైన తర్వాత మళ్ళీ పైలెట్ వృత్తిలోకి వెళ్ళిపోయాడు. తన వృత్తిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక అమెరికా కంపెనీ తరఫున హెలికాప్టర్ నడపటానికి వెళ్ళాడు. అయితే రెండు రోజుల క్రితం తాలిబన్లు జరిపిన దాడిలో జాన్ సందాల్ చనిపోయాడు. ఈ విషయం తెలిసి బ్రిట్నీ స్పియర్ ఎలా స్పందించిందో ఇంకా బయటకి రాలేదుగానీ, బ్రిట్నీ - సందాల్ ఇద్దరికీ సన్నిహితులుగా వుండేవారు మాత్రం బాధపడుతున్నారు. అతను చాలా మంచివాడని కితాబు ఇస్తున్నారు. బ్రిట్నీ స్పియర్ అతని నంచి విడిపోవడానికి ప్రధాన కారణాన్ని కూడా వారు వెల్లడించారు. ప్రతిరోజూ పీకలదాకా తాగుతున్న బ్రిట్నీ స్పియర్ని ఎక్కువగా తాగవద్దని జాన్ సందాల్ హెచ్చరిస్తూ వుండేవాడట. మందు మానేయడం తన వల్ల కాదంటూ బ్రిట్నీ సందాల్‌తో స్నేహమే మానేసిందట.






