TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పది మంది భార్యలు, 15 మంది పిల్లలు

Published on: Wed Apr 1, 2015 12:04PM

 

ఓ 29 ఏళ్ల యువకుడికి 10 మంది భార్యలు, 15 మంది పిల్లలు. త్వరలోనే 16 బిడ్డకు తండ్రి కాబోతున్నానని ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నాడు ఈ కుర్రాడు. ఇంగ్లాండుకు చెందిన కీత్ మెక్ డొనాల్డ్ అనే యువకుడు చిన్న వయసులోనే 15 మంది పిల్లలకు తండ్రయ్యాడు. మెక్ డొనాల్డ్ 15 ఏళ్ల వయసులోనే మొదటిసారి తండ్రయ్యాడు. "అమ్మాయిలను పడేయటం చాలా సులభం. అందుకోసం నేను సుందర్‌లాండ్స్‌ నుంచి బర్మింగ్‌హామ్‌కు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తా. ఫోన్‌ నెంబర్‌ తీసుకుని ఛాటింగ్‌ చేస్తా.. లైన్లో పెడతా.. వాళ్లు కూడా వద్దని చెప్పలేరు. నా పిల్లల తల్లుల్లో చాలా మందితో ఇలాగే పరిచయం ఏర్పడింది.’’ అని ఓ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో చెప్పాడు. బ్రిటన్‌ ప్రభుత్వం అశక్తులకు ఇచ్చే పెన్షన్‌ (ఇన్‌కెపాసిటీ బెనిఫిట్స్‌) రూపంలో మెక్‌ డొనాల్డ్‌కు వారానికి 69 పౌండ్లు (ఆరున్నర వేల రూపాయలు) వస్తాయి. అందరు పిల్లలకు కలిపి కొంత ఖర్చు పెడతానని ఈ 16 బిడ్డల తండ్రి మురిసిపోతూ చెప్పాడు.