త‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉందంటూ ఆసుపత్రి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ సందేశం!

తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని బ్రిటన్ ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప‌ది రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండ‌టంతో తాను ఆసుప‌త్రిలో చేరాన‌ని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వీడియోలో వివరించారు.

మార్చి 27న జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన గత వారం రోజులుగా డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పది రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో తన వ్యక్తిగత వైద్యుని సలహ మేరకు బ్రిటన్‌ ప్రధాని ఆసుపత్రిలో చేరారు.