ముంబై శివసేనదే..?
Published on: Sun Mar 5, 2017 4:23PM
.jpg)
బృహన్ ముంబై మేయర్ పీఠం ఎవరిదా అన్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. తాము నగర మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు తాము పోటీపడటంలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. శివసేనకు బీజేపీ మద్ధతు ఉంటుందని వెల్లడించారు. ముంబై ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ముంబైలోని 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో శివసేన 84 స్థానాలు, బీజేపీ 82 స్థానాలు దక్కించుకుంది. మేయర్ పీఠం దక్కాలంటే మేజిక్ ఫిగర్ 114..కాని ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శివసేన మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఫడ్నవీస్ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ముంబై మేయర్ పీఠాన్ని శివసేన అలంకరించనుంది.


