TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లికి గంటల ముందు వధువు బలవన్మరణం.. కారణమేమిటంటే?

Published on: Sun Dec 11, 2022 11:28AM

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి.. పెళ్లికి గంటల ముందు బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పెళ్లింట విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆదివారం (డిసెంబర్11) జరిగింది.

ఆదివారం మధ్యాహ్నం తన వివాహం. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా బంధు మిత్రులతో గడిపిన రవళి తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా ఆమె తనకు కాబోయే భర్తతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. వివాహం కుదిరినప్పటి నుంచీ కాబోయే భర్త ఆంక్షల పేర వేధిస్తుండటంతోనే రవళి బలవన్మరణానికి పాల్పడిందని పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పెళ్లికూతురి అలంకరణలోనే రవళి విగత జీవిగా పడి ఉండటం చూపరులను కలచివేస్తోంది.