TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ పెళ్లి కూతురుకు ముముము ముద్దంటే చేదే..

Published on: Thu Dec 1, 2022 9:48AM

ప్రేమికులు, దంపతులు ఇలా ఎవరి మధ్య అయినా ముద్దు.. ముచ్చట ఉంటేనే వారి బాంధవ్యం కలకాలం నిలుస్తుందంటారు. అలాంటిది ఒక్క ముద్దు జస్ట్ ఒక్క ముద్దు పీటల మీదే  పెళ్లిని పెటాకులు చేసేసింది. ఎలాగూ మూడుముళ్లూ వేస్తాను కదా అన్న ధీమాతో దండలు మార్చుకున్న వెంటనే పెళ్లి పీటల మీదనే కొంటెగా చిరు ముద్దు పెట్టాడు. అంతే పెళ్ల కుమార్తెకు చిర్రెత్తుకొచ్చింది.

ఈ మొగుడు నాకు వద్దంటే వద్దని పీటల మీద నుంచి లేచి చక్కా వెళ్లి పోయింది. సర్ది చెప్పడానికి పెళ్లి పెద్దలు, తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి పెళ్లి కొడుకు క్షమాపణలు చెప్పినా కాదు పొమ్మంది. దీంతో ఈ పంచాయతీ పోలీసుల వరకూ కూడా వెళ్లింది. ఒకింత ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో సంభల్ జిల్లాలో పరిగింది. బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్లీ గ్రామానికి చెందిన ఓ యువ‌కుడికి, సంభ‌ల్ జిల్లా ప‌వాస‌కు చెందిన ఓ యువ‌తితో వివాహం నిశ్చయించారు. న‌వంబ‌ర్ 26న ముహూర్తం ఫిక్స్ చేశారు. అంత వరకూ బానే ఉంది.

దండ‌లు మార్చుకున్న త‌రువాత వ‌ధువుకు వ‌రుడు ముద్దు పెట్టాడు. ఆ ముద్దే వ‌ధువుకు కోపం తెప్పించింది. వెంట‌నే పెళ్లిపీట‌ల పై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. అందరి ముందూ ముద్దు పెడతాడా అని పెళ్లి కూతురు కోపగించింది. అతడు భర్తగా వద్దే వద్దని భీష్మించింది. చివరకు చేసేదేం లేక పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.