TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాపం... పెళ్ళవగానే చనిపోయింది...

Published on: Wed Dec 16, 2015 10:31AM

 

వరుడు తాళికట్టిన కొద్ది గంటల్లోనే వధువు చనిపోయిన విషాద ఘటన బీహార్లో జరిగింది.బీహార్‌లోని భక్తియార్‌పూర్ ప్రాంతానికి చెందిన సోనీకి అదే ప్రాంతానికి చెందిన రామ్‌ ఆనందంతో వివాహం బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది గంటలకే సోనీ తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. ఆమెని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పెళ్ళికి వచ్చినవారంగా నిర్ఘాంతపోయారు. చనిపోయిన భార్య మృతదేహానికి ఆ భర్త అంత్యక్రియలు నిర్వహించాడు.