నంది నాటకోత్సవాలకు బ్రేక్!?
Published on: Sun Feb 12, 2012 9:36AM
గుం
టూరు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 13న నిర్వహించ తలపెట్టిన అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నట్టు తెలియడంతో కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సమావేశమైన సినీ, రంగస్థల నటులు డీఎస్ దీక్షిత్, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, వరికూటి శివప్రసాద్, గుర్రం సుబ్రహ్మణ్యశాస్త్రి, కాట్రగడ్డ రామకృష్ణ తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిందటేడాది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని వాయిదా వేసి తొమ్మిదినెలల తర్వాత మొక్కుబడిగా నిర్వహించారని ఆరోపించారు. ముందుగా ప్రకటించిన 13వ తేదీనే అవార్డుల బహూకరణ జరగాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల్లోగా ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆదివారం నుంచి జరగాల్సిన ప్రదర్శనలు ఇవ్వబోమని కళాసంస్థలు తేల్చి చెప్పాయి.


