16 ఏళ్ల బాలిక‌పై 33 మంది అత్యాచారం.. కదిలిన బ్రెజిల్ ప్రభుత్వం..

 

బ్రెజిల్ లో ఒక యువతిపై ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 33 మంది అత్యాచారం చేసిన ఘటన ఆ దేశాన్నే కాదు.. యావత్ ప్రంపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించి ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఇంకా దోషులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

 

కాగా బ్రెజిల్ లోని రియో డీజెనీరోలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి బాధితురాలు వెళ్లింది. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. మరుసటి రోజు తాను లేచి చూసేసరికి నగ్నంగా ఉన్నానని.. తన చుట్టూ కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నారని పోలీసులకు చెప్పింది. నీరసించిపోయిన బాధితురాలు మగవాళ్ల దుస్తులు ధరించి ఇంటికి తిరిగివచ్చిందని, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల తరువాత ఆమెకు సంబంధించి 40 సెకన్ల వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీంతో అసలు విషయం బయటపడింది. ట్విట్టర్ యాజమాన్యం ఈ ఫొటోలను తొలగించే లోపే 500 లైక్లు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై బ్రెజిల్లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలపై దాడులు, అత్యాచార సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.