TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రహ్మణి ముద్దుల కొడుకు ఫొటో

Published on: Tue Mar 24, 2015 2:14PM

 

నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ తాతలు అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి దంపతుల దాంపత్యం ఫలించి వారికి ఉగాదినాడు పండండి మగశిశువు జన్మించారు. ఆరోజు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో బ్రహ్మణి తమ కలల పంటకు జన్మనిచ్చారు. ఈ వార్త అటు నారా, ఇటు నందమూరి కుటుంబాలలో మాత్రమే కాకుండా నందమూరి, నారా వారి అభిమానులలో కూడా ఆనందోత్సాహాలు నింపింది. వారిలో ఉత్సాహం పెరిగిపోయి, కొత్తగా పుట్టిన శిశువు సినిమా రంగంలో బాలకృష్ణ వారసుడని కొంతమంది అంటే, రాజకీయ రంగంలో చంద్రబాబు వారసుడని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు తెలివైనవారయితే బాలకృష్ణలాగా సినిమా రంగంలో ఇరగదీసిన తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి చంద్రబాబులా చక్రం తిప్పుతాడని అంటున్నారు. ఈ బుజ్జోడికి, ఎన్టీఆర్‌కి పోలిక తెస్తున్నారు. ఇదిలా వుంటే, నారావారి వారసుడి మొదటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నారా బ్రాహ్మణి మంగళవారం ఉదయం తన ఫేస్ బుక్లో కొడుకు ఫోటో పోస్ట్ చేశారు. ఈ బుజ్జిగాడి ఫోటోను షేర్ చేసుకోవటంతో పాటు లైక్లు కొడుతున్నారు.