TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లవర్ కి  పెళ్లి.. తుపాకీ తో ఆమెను కాల్చి.. తను కాల్చుకుని.. 

Published on: Tue Jun 1, 2021 10:23AM

ప్రేమించడమే పాపం అనేలా తయారు అయింది. ప్రేమ అంటే వాళ్ళు మనతో ఉన్న, లేకున్నా వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు బాగుండాలి అనేది ఒకప్పటి మాట. ప్రేమ నాతోనే పెళ్లి నాతోనే లేదంటే చంపేస్తా ఇది ఇప్పటి మాట. 

వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు, ఎంజాయ్ చేశారు. చివరికి అమ్మాయి తన దారి తాను చూసుకుంది. ఆ విషయం అతడు సహించలేదు. ఆమె వేరే పెళ్లి చేసుకోవడం అతనికి నచ్చలేదు. ఇంకా అంతే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత నిజం చేశాడు. నాకు నాకు సొంతం కానిది ఇంకొకరికి దక్కనివ్వను అనుకున్నాడు ఆ తరువాత ఏం చేశాడో చూద్దాం.. 

ఆమె పేరు  షబ్నం, అతని పేరు రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిచింది. ఇద్దరు మసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా వాళ్ళు ప్రేమలో ఉండగా.. వారి జీవితంలో షబ్నమ్ కు అతడి ప్రవర్తన నచ్చలేదు. ఇక అంతే  షబ్నం అతని ప్రేమకు బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత పెళ్ళికి రెడీ అయ్యింది. పెద్దల ఒక సంబంధం కుదిర్చారు. భగాన్‌ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలోని కెవైది ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కూతురు షబ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26వ తేదీన వివాహం జరిగింది. ఆ పెళ్లితో ఆ అమ్మాయి మరో కొత్త జీవితం కొనసాగించాలనుకుంది. అంత హ్యాపీ అనుకునే సమయం. 

కట్ చేస్తే.. పెళ్లయిన నాలుగో రోజు ఆదివారం షబ్నం భర్తతో కలిసి బైక్‌పై తన పుట్టింటికి బయలుదేరింది. ఇదంతా గమనించిన ఆమె మాజీ ప్రియుడు వారిని ఫాలో అయ్యాడు. వాళ్ళని రాజ్‌పాల్ మార్గమధ్యలో అడ్డుకుని తన ప్రియురాలిని  తనతో రావాలని షబ్నంను ఒత్తిడి చేశాడు. ఆమె తిరస్కరించడంతో రాజ్‌పాల్ ఆగ్రహానికి గురయ్యాడు. కోపం తో ఊగిపోయాడు. దీంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో షబ్నంను తుపాకీతో విచక్షణా రహితంగా కాల్చేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. అనంతరం తాను కూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు వీరిద్దరిని పాట్నాలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.