ఒకేసారి 14 మంది అమ్మాయిలతో ప్రేమ.. చివరికి కోమా!!

 

ఈ జనరేషన్ లో యువత మనసులు 'మల్టీప్లెక్స్ మనసులు' అయిపోయాయి. అర్ధం కాలేదా?. ఏం లేదండి.. మల్టీప్లెక్స్ థియేటర్ అంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు ఆడతాయి. మల్టీప్లెక్స్ మనసు అంటే ఒకేసారి నలుగురు ఐదుగురికి మనసిచ్చి మోసం చేయడం అనమాట. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే యువకుడుది మల్టీప్లెక్స్ మనసు కాదు.. అంతకుమించి. అప్ డేటెడ్ వర్షన్ మల్టీప్లెక్స్ 2.ఓ అనమాట.

రఖీబ్ అనే 18ఏళ్ల  యువకుడు.. 'మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను' లాంటి డైలాగ్ లు చెప్పి ఒకేసారి 14మంది అమ్మాయిలను లైన్లో పెట్టాడు. పాపం ఆ అమ్మాయిలేమో ఎవరికివారు 'వీడికి నేనే ప్రపంచం.. వీడే నా ప్రపంచం' అని మురిసిపోతూ వీడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కొన్నాళ్లపాటు బాగానే మేనేజ్ చేసాడు.. 14మందితో ఎంచక్కా ఎంజాయ్ చేశాడు. కానీ కొన్ని రోజులకు స్క్రీన్ ప్లేలో అసలు ట్విస్ట్ వచ్చింది. మనోడికి 14 బాగా సెంటిమెంట్ కదా.. అందుకేనేమో ఆ ఫిబ్రవరి 14(వాలంటైన్స్ డే) రోజే అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అసలే వాలంటైన్స్ డే ఒకేరోజు 14 మంది అమ్మాయిలను విష్ చేసి బెస్ట్ లవర్ అనిపించుకోవాలిగా.. అందుకే ఉదయాన్నే నిద్ర లేచి.. కలర్ ఫుల్ డ్రెస్ వేస్కొని.. బయటికి వెళదామని స్టైల్ గా డోర్ తీసాడు. ఎదురుగా 14మంది గర్ల్ ఫ్రెండ్స్ నిల్చొని ఉన్నారు. అంతే వాళ్ళని చూసి ఒక్కసారిగా మనోడికి బుర్ర తిరిగిపోయి కిందపడ్డాడు. ఇంతవరకు లేవలేదు. అదేనండి కోమాలోకి వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై అతని గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏమందో తెలుసా..‘ఒక రోజు రిఖబ్ ప్రవర్తన నాకు తేడాగా అనిపించింది. అతనికి తెలీకుండా ఫోన్ చెక్ చేశాను. అందులో బేబీ 1, బేబీ2 అంటూ.. 14మంది అమ్మాయిల నెంబర్లు సేవ్ చేసి ఉన్నాయి. అందరితో ప్రేమగా చాట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. నాతోపాటు మరో 13మందిని మోసం చేశాడని తెలుసుకున్నాను. వెంటనే వాళ్లందరికీ ఈ విషయం చెప్పాను. అందరం కలిసి షాక్ ఇద్దామని వాలంటైన్స్ డే రోజు తన దగ్గరికి వస్తే.. అతను కోమాలోకి వెళ్లిపోయాడు. ఇలా జరుగుతుందని ఊహించలేదు. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పింది. ఇదన్నమాట '14 మంది అమ్మాయిలతో ప్రేమ.. చివరికి కోమా' కథ.