అయ్యో బొత్స... ఎంత పని జరిగింది...!


బొత్స సత్యనారాయణ రాజకీయాను భవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయాన్ని కాచి వడబోశాడు ఆయన. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి ప్రజలనుండి వ్యతిరేకత మూటగట్టుకోవడంతో... ఇక ఆపార్టీ నుండి బయటకు వచ్చేసి వైసీపీలో చేరాడు. ఇంకేముంది.. తాను సీనియర్ నాయకుడు కాబట్టి వైసీపీ పార్టీలో తనను అందెలం ఎక్కిస్తారు అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏదో పార్టీలో చేరిన కొన్ని రోజులు మాత్రం బాగానే హడావుడి చేశారు. కానీ అక్కడ ఉంది జగన్. నేను మోనార్క్ ని.. నా మాటే అందరూ వినాలి అనే టైపు. ఇంకేముంది అందరిలాగానే రాను రాను బొత్సకు ఉన్న ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన భవిష్యేత్తే ప్రశ్నార్ధకంగా అయిపొయింది. పోనీ జనసేన పార్టీలో చేరదామనుకుంటే.. అక్కడా ఆయనకు చేదు అనుభవమే ఎదురైనట్టు రాజకీయ వర్గాల టాక్. పవన్ కళ్యాణ్ తో బాగా పరిచయాలు ఉన్నాయి కదా జనసేన పార్టీలో చేరి చక్రం తిప్పుదాం అని భావించి... త‌న‌కు తెలిసిన వాళ్ల ద్వారా జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు క‌బురు పంపార‌ట‌. కానీ జనసేనాని నుంచి తిరస్కారం ఎదురైన‌ట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అంటూ బాగా టెన్ష‌న్ ప‌డిపోతున్నాడ‌ని టాక్‌. అంతేకాదు.. జనసేనలోకి తనను పవన్ ఎందుకు వద్దన్నారబ్బా అని ఆయన జుట్టు పీక్కుంటున్నాడట. మొత్తానికి నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చింది అన్న సామెత ప్రకారం... ఇంత రాజకీయానుభవం ఉన్నబొత్సను పార్టీలు పక్కన పెట్టడం ఆశ్చర్యకరమైన విషయమే..