TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రులు అధికారులను ప్రశ్నిస్తే తప్పులేదు : బొత్స

Published on: Sat Dec 17, 2011 1:18PM

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అమలౌతోన్న తీరుపై సమావేశంలో మంత్రులు అధికారులను ప్రశ్నించారని, ఇందులో తప్పేమీలేదని  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సులో కొందరు మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని అయన  సమర్థించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవినీతిపరులంతా విశ్వామిత్రులైపోరన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ఉప ఎన్నికలో శ్రీరాములు గెలుపును బొత్స ప్రస్తావించారు.

రాష్ట్ర ఉప ఎన్నికల్లోనూ జగన్‌ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని పరోక్షంగా చెబుతున్నారా అని ప్రశ్నించగా నేను కర్ణాటక గురించి మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు లింకు పెడతారని ఎదురు ప్రశ్న వేశారు. జగన్‌తో సన్నిహితంగా ఉంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామన్నారు.