త్వరలో అధ్యక్షులు నియమకం:బొత్స
Published on: Sun Dec 18, 2011 12:51PM
హైదరా
బాద్: రెండు మూడు రోజుల్లో పలు జిల్లాల డిసిసి అధ్యక్షులను నియమిస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సోమవారం చర్చించిన అనంతరం డిసిసి అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తామని చెప్పారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనమండలి సభ్యులపై రెండు మూడు రోజుల్లో శాసనమండలి చైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేస్తామని అయన చెప్పారు. జగన్‌తో వెళుతున్న పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్ రెడ్డి, కొండా మురళీలపై కాంగ్రెసు ఫిర్యాదు చేయనుంది.
కాగా మద్యం సిండికేట్ల విషయంలో పలు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల నివేదికలు మీడియాకు అందజేయాలని సిఎస్, ఎసిబి డిజిలకు సూచించారు. దాడులలో బయటపడ్డ అన్ని వివరాలను బహిర్గతం చేయాలని చెప్పారు. ఎలాంటి రాజకీయ విమర్శలకు తావివ్వకుండా, ప్రజల్లో ఉన్న అనుమానాలను వాస్తవాలు బయటపెట్టడం ద్వారా నివృత్తి చేయాలని వారికి ఫోన్ చేసి సూచించారు.


