TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లిక్కర్ స్కామ్, బొత్సకు వాటాలు: ఉమ

Published on: Sun Dec 18, 2011 12:01PM

విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాష్ట్రంలోని మద్యం షాపులలో వాటాలు ఉన్నాయని  ఆరోపిస్తూ దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సిబిఐ సోదాల వివరాలు బయట పెట్టాలన్నారు.ఎసిబి దాడుల్లో బయటపడుతున్న వాస్తవాలు చూస్తుంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు అవినీతిలో ఎంతగా కూరుకుపోయారో అర్థమవుతోందన్నారు. మద్యం సిండికేట్ల కుంభకోణంలో ప్రమేయమున్న మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.

కాగా రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాలపై ఎసిబి దాడులు చేస్తోంది. ఈ దాడులలో ఎసిబి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు గుర్తించింది. సిండికేట్లు ఎవరెవరికి ఎంత లంచమిచ్చామని పొందుపర్చిన వివరాలు ఎసిబి గుర్తించింది.