సమైఖ్య ఆగ్రహంలో 'సత్తిబాబు'

 

 

 

కేంద్రం రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రలోఉద్యమం పూర్తిగా చెయ్యి దాటి పోయింది. సమైక్య ఉద్యమంలో ఉత్తరాంధ్ర మొదటి నుంచి ప్రశాంతత ఉద్యమానికే వేదికయ్యింది. కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉత్తరాంధ్ర ఉగ్రాంధ్రగా మారిపోయింది. ముఖ్యంగా విజయనగరం జిల్లా రణరంగంగా మారిందనే చెప్పాలి.

 

ఈ ఆగ్రహంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ, బంధువర్గం టార్గెట్ గా ఆస్తుల విధ్వంసం జరుగుతుంది. సమైక్య వాదులో లేక బొత్స అంటే గిట్టని వాళ్ళో తెలియదు గాని ..ఆయన ఆస్తులపై తీవ్ర దాడులు కొనసాగుతున్నాయి.  శుక్రవారం ఆయన ఆస్తులపై ఆందోళనకారులు పెద్ద యెత్తున దాడి చేశారు.



శనివారం కూడా ఆయన నివాసం వద్ద ఆందోళనలను కొనసాగిస్తున్నారు.  బొత్స నివాస ముట్టడికి మరోసారి విద్యార్థులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.