TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్ లో ఏ ముంది?.. బొత్స పెదవి విరుపు

Published on: Sat Feb 14, 2026 2:25PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14) ప్రవేశపెట్టిన బడ్జెట్ పై శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెదవి విరిచారు.

పయ్యావుల బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్థుతి, పరనిందేనని విమర్శించారు.  అంకెల గారడీ తప్ప ఏ మాత్రం పసలేని బడ్జెట్ అంటూ బడ్జెట్ ప్రసంగంలో   చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పేర్లను పదిసార్లు ప్రస్తావించడం తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు  లేవని విమర్శలు గుప్పించారు.   ఈ బడ్జెట్ ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా  ఈ బడ్జెట్ దెబ్బతీసిందని బొత్స అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో  మాట్లాడిన బొత్స గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం కోత పెట్టిందనీ,   ఇక రాష్ట్ర అప్పుల విషయంలోనూ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని   ఆరోపించారు.