TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీ.. బీమిలి బాధ్యతలు అప్పగించిన జగన్.. స్థానిక సమరమే తొలి సావాల్.!

Published on: Wed Sep 30, 2026 11:18AM

రాజకీయాల్లో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.  దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతల కుటుంబాల నుంచి కొత్త తరం నాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే..  సహజంగానే అందరి దృష్టి వారిపై కేంద్రీకృతమవుతుంది.  ప్రస్తుతం అలాంటి ఆసక్తిని, చర్చను బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీ రేకెత్తిస్తోంది. బొత్స అనూష్,, రాష్ట్ర రాజకీయాలలో సీనియర్ మోస్ట్ నాయకుడు,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె.   తాజాగా ఆమె విశాఖపట్నం పరిధిలోని భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు అయితే, రాజకీయాల్లో ఆమెకు ఇది కేవలం సాధారణ ఆరంభం మాత్రమే కాదు.. తొలి అడుగులోనే ఒక భారీ సవాల్ ను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయాలలో కీలక నియోజకవర్గాలలో భీమిలి కూడా ఉంది. 

విశాఖ నగరానికి సమీపంలో ఉండటంతో పాటు, ఈ ప్రాంతంలో గ్రామీణ,  పట్టణ రాజకీయాల మిశ్రమ స్వభావం ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తుంది.  ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల మార్పుల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొత్త పరిధిలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం వంటి మండలాలుకీలకంగా మారగా, పెందుర్తి పరిధిలోని ప్రాంతాలు కూడా ఈ రాజకీయ సమీకరణాల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.  

దీనివల్ల భీమిలి కేవలం సాధారణ అసెంబ్లీ నియోజకవర్గంగా మాత్రమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల రాజకీయాలకు  ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇక్కడే బొత్స అనూషకు అసలైన పరీక్ష .  పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో క్యాడర్‌‌ను సమన్వయం చేయడం, స్థానిక నాయకత్వాన్ని ఏక తాటిపై నడిపించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ ను యాక్టవేట్ చేయడంవంటి కీలక బాధ్యతలు ఆమె నిర్వర్తంచాల్సి ఉంది.  క్యాడర్‌ను తిరిగి యాక్టివ్ చేయడం వంటివి ఆమె ముందున్న ప్రధాన సవాళ్లు. అంతకు మించి..  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సత్తా చాటాల్సి ఉంది.  ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  

బొత్స కుమార్తెగా నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలు అయితే వచ్చాయి కానీ, ఇక ముందు బొత్స కుమార్తె గా మాత్రమే రాజకీయం చేస్తానంటే కుదరదు.  క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై గళమెత్తాల్సి ఉంటుంది . గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమవ్వాల్సి ఉంటుంది. క్యాడర్‌లో ఉత్సాహం నింపాలి, స్థానిక సమస్యలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి పార్టీల క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను ఎదుర్కొంటూ వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను ఎంత మేరకు యాక్టివ్ చేయగలరన్న దానిపైనే బొత్స అనూష్ రాజకీయ భవిష్యత్  ఆధారపడి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   


[Botsa Anusha, Bheemili Constituency, Botsa Satyanarayana, YCP, Andhra Pradesh Politics, Challange, Reai Test, Telugu One]