TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్స వ్యాఖ్యలు..కల్తీ సారా తాగిన వారిదే తప్పు

Published on: Thu Jan 5, 2012 8:08AM

హైదరాబాద్‌: తప్పంతా కల్తీసారా తాగిన వారిదేనని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. కృష్ణా జిల్లాలో కల్తీ సారా తాగి మృతిచెందిన వారిపై  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కల్తీ సారాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులపైనా ఉందని అంగీకరించారు. కల్తీ సారా తయారు చేసింది టిడిపి నేతల అనుచరులేనని బొత్స విమర్శించారు. రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తే ఎలాగని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యులెవరో గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కానీ, రోడ్డు ప్రమాదంతో కృష్ణా జిల్లా ఘటనను తాను సరిపోల్చడం లేదని సత్తిబాబు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో సీఎం కిరణ్‌కు కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి లేఖ రాయడంలో తప్పేమీ లేదని.. ఆ లేఖలోని ప్రతి పదాన్నీ తాను బలపరుస్తున్నానని అన్నారు. కాపుసారా తాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 50 వేలు ఇస్తామని తెలిసినందునే.. ప్రభుత్వం రెండు లక్షల పరిహారం ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పేర్కొడనం పెద్ద జోక్ అని సత్తిబాబు ఎద్దేవా చేశారు.

కాగా, తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న జగన్ నిర్ణయంపై సత్తిబాబు విస్మయం వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో ఎవరితోనైనా మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యోదంతం అనుభవంతో సీబీఐపై జగన్ విమర్శలు చేస్తున్నారేమోనని బొత్స సందేహం వ్యక్తం చేశారు.


కాగా,ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధర్నా చేయడాన్ని బొత్స విమర్శించారు. ధర్నాలు చేయడం వంటి చౌకబారు ఆలోచనలు వైయస్ జగన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం సోనియా నాయకత్వంలోని తమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, దాన్ని అమలు చేసి తీరుతామని, అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.