లిక్కర్ మాఫియా డాన్‌గా బొత్స :చంద్రబాబు
Published on: Thu Jan 19, 2012 3:41PM
హైదరాబాద్:ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా డాన్‌గా కొనసాగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతు పోరుబాటను ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.లిక్కర్ డాన్‌గా బొత్స సత్యనారాయణ రావు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులతో ఆయన భారీ ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఢిల్లీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు.రైతుల సమస్యలు పరిష్కరించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వహరిస్తోందన్నారు.గిట్టుబాటు ధరతోపాటు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం కళ్లు తెరవడంలేదని ఆయన మండిపడ్డారు.


