TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ

Published on: Wed Mar 12, 2025 11:24AM

రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో లొంగిపోయాడు. మంగళవారం సాయంత్రంతో ఆయన మధ్యంతర బెయిల్‌ గడువు ముగియడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు అతను జైలులో లొంగిపోయాడు. టీడీసీ నేతలను దూషించిన కేసులో బోరుగడ్డ నిందితుడిగా ఉన్నాడు. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్‌ పొందారు. ఇందుకోసం నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు నిర్ధరించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1న బోరుగడ్డ మధ్యంతర బెయిల్‌ పొడిగించుకున్నాడు.

నకిలీ వైద్య ధృవపత్రంతో బురిడీ కొట్టించిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు ఏపీ హైకోర్టు  షాకిచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిలును పొడిగించుకునేందుకు అనిల్‌ చేసిన ప్రయత్నానికి చెక్‌ పెట్టింది. మధ్యంతర బెయిలును పొడిగించే ప్రసక్తే లేదని, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ ముందు లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు బోరుగడ్డ అనిల్ బుధవారం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో లొంగిపోయాడు. 

మరోవైపు గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్‌తో బోరుగడ్డను అదుపుతోకి తీసుకునేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను సంప్రదిస్తున్నారు. తప్పుడు సర్టిఫికేట్లతో కోర్టుని తప్పుదారి పట్టించిన అనీల్‌పై తీవ్ర అభియోగాలతో మరో కేసు నమోదు కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.