హైదరాబాద్‌లో రెండు రోజులు మద్యం బంద్

వీకెండ్ రాబోతోంది ఫ్రెండ్స్‌తో సరదాగా పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా..అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్..హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు జంటనగరాల్లో మద్యం అమ్మకాలు నిషేధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బోనాల పండుగలో పవిత్రతను కాపాడటానికి..భక్తి శ్రద్దలను పెంపోందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేయబోతోంది.