TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారు బోనం సమర్పించనున్న ఎంపీ కవిత..!

Published on: Sun Jul 20, 2014 10:56AM

లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి ప్రారంభమైంది. సింహవాహిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సీఎం కేసీఆర్, రాజకీయ ప్రముఖులు రానున్న సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే బంగారు బోనాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత సమర్పించనున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సంబంధిత మంత్రులు సమర్పించనున్నారు. 6వేల మంది పోలీసులు బోనాల పండుగ బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు.