బాంబే కోర్టులో హజారేకు ఎదురుదెబ్బ
Published on: Fri Dec 23, 2011 3:36PM
ముంబై: సామాజిక కార్యకర్త, పటిష్ట లోక్‌పాల్ బిల్లుకై పోరాటం సాగిస్తున్న అన్నా హజారేకు బాంబే కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉచితంగా, లేదా ధరలో రాయితీ కల్పిస్తూ ఎమ్ఎమ్ఆర్డీఏ గ్రౌండ్‌ను అన్నా హజారే దీక్షకు కేటాయించాలని జాగృత్ నాగరిక్ మంచ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీక్ష కోసం ఆజాద్ మైదానాన్ని కేటాయించడానికి, గేట్లు తెరిపించడానికి ప్రభుత్వానికి ఆదే శాలు జారీ చేసే అధికారం తమకు లేదని బాంబే హైకోర్టు తెలిపింది. జాతి, ప్రజ ప్రయోజనాల కోసం తలపెట్టిందా లేక రాజకీయ ప్రేరణతో ఉద్యమం నడుస్తోందా అనే విషయాన్ని డిసైడ్ చేసే అవకాశం కోర్టుకు లేదు బాంబే కోర్టు వ్యాఖ్యానించింది.


