TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు సభలో బాంబు కలకలం? కుప్పంలో హై టెన్షన్..  

Published on: Fri Oct 29, 2021 5:09PM

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అతని వైపు జనాల్లోనుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దూసుకువచ్చారు. వాళ్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు వైపు దూసుకొచ్చింది వైసీపీ కార్యకర్తగా అనుమానిస్తున్నారు. దుండగుడి  చేతిలో రాళ్లు, కర్ర ఉండటంతో అంతా షాకయ్యారు. ఈ ఘటనతో చంద్రబాబు సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వైసీపీ కార్యకర్త కర్రలు, రాళ్లతో దూసుకురావడంతో చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ ఘటన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుపై వేయడానికి బాంబులు తీసుకుని వైసీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై బాంబులు వేస్తామని ఇటీవలే కొందరు వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుప్పం చంద్రబాబు పర్యటనలో రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్త హల్ చల్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.