TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'తృణమూల్ కాంగ్రెస్' పార్టీ ఆఫీసులో భారీ పేలుడు

Published on: Thu Aug 23, 2018 3:50PM

 

పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణ్ ఘర్‌లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో ఒక కార్యకర్త చనిపోగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.. ఈ ఘటనపై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.