హైఅలర్ట్.. సీఎం సభలో బాంబు పేలుడు..
Published on: Tue Apr 12, 2022 5:31PM
ముఖ్యమంత్రి సభలో భారీ శబ్దంతో బాంబు పేలడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సీఎంకు సమీపంలోనే ఈ బ్లాస్టింగ్ జరగడంతో తీవ్ర కలకలం చెలరేగింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. భద్రతా సిబ్బంది సీఎంకు రక్షణగా నిలిచి అక్కడి నుంచి తరలించారు. బాంబు పేలుడు ఘటన బీహార్‌లో ప్రకంపణలు రేపింది. సీఎం నితీష్‌కుమార్ సురక్షితంగా ఉన్నారు.
భారీ పేలుడుతో ఒక్కసారిగా సీఎం సభలో గందరగోళం నెలకొంది. చివరకు అది బాణసంచా పేలుడుగా గుర్తించారు. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదు.
ఇటీవల సీఎం నితీష్‌పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి.. సెక్యూరిటీని పక్కకు నెట్టి.. నేరుగా సీఎం నితీష్ వరకూ వెళ్లి.. వెనుక నుంచి కొట్టాడు. ఆ దాడితో ముఖ్యమంత్రి భద్రతపై ఆందోళన వ్యక్తం అయింది. సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు వచ్చాయి. అది మరవక ముందే.. తాజాగా నలందలో.. ఓ సభలో.. సీఎంకు సమీపంలోనే భారీ పేలుడు జరగడంతో బీహార్‌తో పాటు దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


