కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి
Published on: Fri Mar 3, 2017 10:05AM

కేరళ కల్లాచి ప్రాంతంలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. రాత్రి 8.30 ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంపై పెట్రోలు బాంబులు విసరారు. ఈ ఘటనలో లోపల ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయ విజయన్ను హత్య చేసిన వారికి కోటి రూపాయల నగదు బహుమతిని ఇస్తానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ ప్రకటించడంతో ఆర్ఎస్ఎస్-సీపీఎం వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చంద్రావత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేడు కేరళలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కాగా, సీపీఎం కార్యకర్తలే ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి చేశారని సంఘ్ ఆరోపిస్తోంది.


