విద్యాబాలన్ చెంప చెళ్లుమంది

 

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెంప చెళ్లుమనిపించాడు ఓ వ్యక్తి. ఆమెను ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? అందుకు ఆమె ఏమీ అనలేదా? ఇలా ఎన్నో అనుమానాలు వచ్చేస్తున్నాయి కదా. సంగతేంటంటే విద్యాబాలన్, రాజ్ కుమార్ రావ్ 'హమారీ అదూరీ కహానీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో విద్యాబాలన్ చెంపపై హీరో మూడుసార్లు కొట్టాడు. సీన్ వాస్తవాన్ని తలపించేలా ఉండాలని డైరెక్టర్ గారు విద్యాబాలన్ చెంప మీద మూడుసార్లు కొట్టించారట. గృహహింస ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి ఈ సన్నివేశం తీశామని డైరెక్టర్ తెలిపారు.