TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేఖతో నటించడానికి రెడీ...

Published on: Thu Jan 8, 2015 11:44AM

 

వయసు పెరిగినా రేఖ అందం ఎంతమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో రేఖతో మళ్ళీ నటించడానికి తాను రెడీగా వున్నానని అమితాబ్ బచ్చన్ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. గురువారం నాడు షమితాబ్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రేఖతో నటించేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించారు. అమితాబ్ - రేఖ అభిమానుల మనసులలో వున్న ఆకాంక్షకు సమాధానాన్ని అమితాబ్ బచ్చన్ ఇలా వ్యక్తం చేశారు. గతంలో అమితాబ్, రేఖ కాంబినేషన్లో వచ్చిన సిల్సిలా, మిస్టర్ నట్వర్లాల్, ముఖద్దార్ కా సికిందర్ చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు సృష్టించాయి. అప్పట్లో బాలీవుడ్ హిట్ పెయిర్‌గా నిలిచిన వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచిందని అంటారు.