Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రియాంక చోప్రా ఇంట్లో సెక్స్ రాకెట్
posted on: Nov 27, 2014 3:28PM

బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ఇంట్లో నడుస్తున్న సెక్స్ రాకెట్‌ని ముంబై పోలీసులు రట్టు చేశారు. ఆ ఇంటి మీద దాడి చేసిన పోలీసులు ఆ ఇంట్లో వ్యభిచార కార్యకలాపాలు నడుపుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని అంధేరిలో ప్రియాంకా చోప్రాకి ఒక ఇల్లు వుంది. ఆ ఇంటిని ప్రియాంక చోప్రా ఒక బ్యూటీపార్లర్ కమ్ స్పా నడిపే మహిళలకు అద్దెకు ఇచ్చింది. వాళ్ళు ప్రియాంకా చోప్రాకి చెప్పింది ఒక ప్రొఫెషన్.. ఆ ఇంట్లో నడుపుతోంది మరో ప్రొఫెషన్. ఈ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం మీద సందేహం వచ్చిన పోలీసులు కాపుకాచి గురువారం నాడు ఈ ఇంట్లో వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ప్రియాంక చోప్రా ఇంటిని వ్యభిచార గృహంగా మార్చిన సదరు గృహం నిర్వాహకురాలు మాత్రం పరారీలో వుంది. ఈ సెక్స్ రాకెట్ పుణ్యమా అని ఏ పాపం ఎరుగని ప్రియాంకా చోప్రా పేరు బద్నాం అయింది.






