TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెయిట్ లాస్‌ కోసమెళ్తే ప్రాణమే లాస్

Published on: Mon Apr 28, 2014 12:08PM

 

 

 

కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనేది పాత సామెత. ఇప్పుడు ఆ సామెతకి తగ్గ సంఘటన ఇండోర్‌లో జరిగింది. అయితే ఈ సంఘటనలో నాలుక ఊడిపోలేదు. ఏకంగా ప్రాణమే పోయింది. టీవీ సీరియల్స్‌ లో నటించిన రాకేష్ దివాన్ అనే నటుడు చాలా లావుగా వుంటాడు. ఆ లావు పర్సనాలిటీ కారణంగా కొనేళ్ళక్రితం టీవీలో వచ్చిన రామాయణం సీరియల్‌లో కుంభకర్ణుడి పాత్ర ఆయనకి దక్కింది. ఆ పాత్ర ద్వారా రాకేష్ దివాన్ బాగా పాపులర్ అయ్యాడు.

 

అయితే ఆయనకి సడెన్‌గా సన్నబడిపోవాలన్న కోరిక కలిగింది. వెంటనే ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిని సంప్రదించాడు. ఆస్పత్రి వాళ్ళు ఆయన ఒంట్లోని కొవ్వు తీసేయడానికి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ జరుగుతూ వుండగానే రాకేష్ దివాన్ ప్రాణాలు కోల్పోయాడు. దివాన్ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ వాళ్ళు నాసిరకం వైద్యం చేశారన విమర్శిస్తుంటే, సదరు హాస్పిటల్ వాళ్ళు మాత్రం దివాన్ చనిపోయింది అతని అనారోగ్యం కారణంగానే తప్ప తమ వెయిట్‌లాస్ ఆపరేషన్ కారణంగా కాదని అంటున్నారు. ఏది ఏమైనా వెయిట్ లాస్ ఆపరేషన్ కారణంగా ఒక ప్రాణమే లాసయింది.