తండ్రి రాజ్ కపూర్ నుంచి డాన్ దావూద్ దాకా అందర్నీ 'బుక్' చేసేశాడు!

 

రాజకీయాల్లో సినిమా వాళ్లు వుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కాని, సినిమాల్లోనూ రాజకీయం వుంటుంది. ఇది చాలా మందికి పెద్దగా తెలియదు. తెలిసిన మనం అంతగా పట్టించుకోం. తెరపైన కనిపించే సినిమానే ఎంజాయ్ చేస్తాం కాని తెర వెనుక జరిగే సినిమా వారి రాజకీయాలు, రాసలీలలు మనకు అంతగా ఇంట్రస్ట్ అనిపించవు. అప్పుడప్పుడూ ఎఫైర్లపై జనం ఆసక్తి చూపినా అందులో నిజానిజాలు మనకు తెలిసే ఛాన్స్ వుండదు. పత్రికల్లో, ఛానల్స్ వచ్చేదంతా నిజమనటానికి ప్రూఫ్స్ వుండవు. కాని, ఇప్పుడు బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోన్న ఒక బుక్ సినిమా రంగం, సినిమా సెలబ్రిటీల గురించి బోలెడు ఆసక్తికర విషయాలు చెబుతోంది. పైగా దీన్ని ఎవరో అనమకుడు రాయలేదు. స్వయంగా బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ కొడుకు రిషీ కపూర్ కుండ బద్ధలు కొట్టాడు!

 

సాధారణంగా ఆత్మకథలు అందరూ రాస్తూ వుంటారు. రిషీ కపూర్ రాసింది అలాంటిది కాదు. ఆ విషయం తెలియాలంటే మనం ఆయన రాసిన ఆటోబయోగ్రఫికి పెట్టిన పేరు తెలుసుకోవాలి! 'ఖుల్లమ్ ఖుల్లా : రిషీ కపూర్ అన్ సెన్సార్డ్' ... ఇదీ పుస్తకం పేరు! అందుకు తగ్గట్టుగానే సాధారణంగానే సినిమా సెలబ్రిటీలు సాహించని సత్యాలు చెప్పేశాడు ఈ బాబీ మూవీ సూపర్ స్టార్!

 

ఎప్పుడూ సినిమా రంగంలో అంతా మాట్లాడుకునే మాట... అవార్డ్ లు కొనటం! తన బాబీ సినిమా విడుదలైన సంవత్సరం తాను అవార్డ్ కొన్నానని రిషీ నిర్ద్వంద్వంగా చెప్పేశాడు. ఒక సినిమా పత్రిక ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డ్ అంటూ క్లూ కూడా ఇచ్చిన ఆయన తాను అది కొనేశానని చెప్పాడు. అందువల్ల అదే సంవత్సరం జంజీర్ సినిమాకి తనకు రావాల్సిన అవార్డ్ రిషీకి పోయిందని అమితాబ్ బాధ పడ్డాడట కూడా! ఈ రివిలీషన్ తో రిషీ కపూర్ సినిమా రంగంలో అవార్డ్ లు కొనుక్కోవటం నిజమేనని నిరూపించేశాడు!

 

రిషీ తనకు పడని వారి గురించి నిజాలు చెప్పి సంచలనం సృష్టించలేదు. తన బుక్ లో తన తండ్రినే బుక్ చేసేశాడు! రాజ్ కపూర్ అతడి హీరోయిన్స్ తో సరసాలు బాగానే సాగించే వాడని అందిరకీ తెలుసు. కాని, ఇప్పటి వరకూ అందుకు కన్ ఫర్మేషన్ లేదు. రాజ్ కపూర్ ఎప్పుడూ ఓపెన్ గా చెప్పలేదు. అతడి హీరోయిన్స్ కూడా అప్పటి కాలంలో ఎప్పుడూ యెస్ అనలేదు. నో అనలేదు. కాని, తన ఆత్మకథలో తండ్రి గురించి హాట్ గానే రాశాడు రిషీ కపూర్. రాజ్ కపూర్ నర్గీస్ దత్ తోని, వైజయంతీమాలాతోని రిలేషన్లో వున్నాడని సుస్పష్టం చేసేశాడు!

 

తండ్రి గురించి చెప్పిన రిషీ కపూర్ తన గురించి కూడా క్లియర్ గానే చెప్పాడు. తనకు ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ తో పడదని చెప్పుకొచ్చాడు. అలాగే, రాజేష్ ఖన్నా తన తండ్రి రాజ్ కపూర్ సినిమాలో నటించాలని ఎంత ట్రై చేసినా తాను అది వీలు కాకుండా రాజకీయం చేశానని వివరించాడు. ఇక ఫైనల్ గా దుబాయ్ లో తాను దావూద్ తో టీ తాగనని కుండ బద్ధలు కొట్టి ఆటోబయోగ్రఫికే కొత్త క్రేజ్ తీసుకొచ్చాడు. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్, పొలిటీషన్స్ దావూద్ తో తాము ఫోన్ లో మాట్లాడమనే ఒప్పుకోరు. అటువంటిది రిషీ కపూర్ దుబాయ్ లో టీ తాగనని, మరోసారి దావూద్ ను ఓ ఫారిన్ కంట్రీలో షాపింగ్ చేస్తూ కలుసుకున్నానని చెప్పాడు!

 

ఆత్మకథ పేరుతో ఏ పసలేని కథనాలు ఒక చోట పోగేసే వారి కన్నా రిషీ కపూర్ బెటర్ అనే చెప్పాలి. ఆయన బుక్ ఖుల్లమ్ ఖుల్లా ఖచ్చితంగా చదవాల్సిన గ్రంథమే. బాలీవుడ్ మీద ఇంట్రస్ట్ వున్న వారైతే అస్సలు మిస్ అవ్వకూడదు!