డ్రైవర్ లేకుండా కారు తెస్తోన్న బీఎండబ్ల్యూ..

ఎప్పుడూ మీరే డ్రైవింగ్ చేయాలంటే బోరు కొడుతోందా..? అలాంటి వారి కోసమే ప్రఖ్యాత బీఎండబ్ల్యూ కొత్త ప్రయోగం చేయబోతోంది. సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే చాలు దానంతట అదే నడిచే కారును బీఎండబ్ల్యూ త్వరలో తీసుకురానుంది. 2021 నాటికి ఇలాంటి కారును అందుబాటులోకి తెచ్చేందుకు రెండు పెద్ద కంపెనీలతో జతకట్టింది. అమెరికాకు చెందిన కంప్యూటర్ చిప్‌ల కంపెనీ..ఇంటెల్, ఇజ్రాయిల్‌ కంప్యూటర్ కంపెనీ..మొబైల్ ఐ ఈ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకోనున్నాయి. ఈ కల సాకారమైతే వాహన ప్రయాణంలో మరో కొత్త అనుభూతి సొంతమవుతుంది.