రెండు బస్తాల బ్లూఫిలిం సీడీలు...

 

చెన్నైలోని కోయంబేడు బస్టాండులో చెన్నై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి బ్లూఫిలిం సీడీలను పట్టుకున్నారు. పోలీసులు జరిపిన దాడిలో రెండు బస్తాల నిండా వున్న బ్లూ ఫిలిం సీడీలు దొరికాయి. ఈ రెండు బస్తాల్లో ఐదు వేల బ్లూ ఫిలిం సీడీలు వుండొచ్చని భావిస్తున్నారు. ఈ సీడీలు చెన్నైలోని వివిధ ప్రాంతాలలో వున్న సీడీల విక్రయ కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో వుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటిని చెన్నై నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేయడానికి వాటీ తయారీదారులు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.