TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కౌంటింగ్ రోజున అవకతవకలకు పాల్పడితే రక్తపాతమే

Published on: Wed May 22, 2019 4:19PM

 

కౌంటింగ్ రోజున అధికార పార్టీ బీజేపీ అవకతవలకు పాల్పడితే  ప్రజలు చూస్తూ ఊరుకోరని, అవసరమైతే రక్తపాతం సృష్టిస్తారని రాష్ట్రీయ లోక్ సమత పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ) చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా  హెచ్చరించారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నారని, దీని గురించి ప్రశ్నిస్తే ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఈ పరిణామాలు చూసి జనం ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే మహా కూటమి కానీ, ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరదని కుష్వాహా హెచ్చరించారు. తమ ఓటు తమకు గౌరవం. తమ బతుకుల జోలికి వస్తే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాటం చేస్తామో.. అలానే తమ ఓట్ల కోసం కూడ పోరాటం చేస్తామని  చెప్పారు. కౌంటింగ్ రోజున అవకతవకలకు పాల్పడితే హింసాకాండ చేలరేగడం ఖాయమన్నారు.

గత ఏడాది డిసెంబర్ లో ఎన్డీయే కూటమి నుండి ఆర్ఎల్‌ఎస్‌పీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కుష్వాహా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.