హెచ్‌పిసిఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

 

వైజాగ్ సిటీ మ‌రోసారి ఉలిక్కి ప‌డింది. న‌గ‌రంలోని హెచ్‌పిసిఎల్ క‌ర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం జ‌రిగింది.నిర్మాణ ద‌శ‌లో ఉన్న కూలింగ్ ట‌వ‌ర్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ప్రాధ‌మిక స‌మాచారం ప్రకారం ఇద్దరు మ‌ర‌ణించిన‌ట్టుగా చెపుతున్నా ప‌ది మందికి పైగానే మ‌ర‌ణించి ఉంటారంటున్నారు ప్రత్యక్షసాక్షులు. ఈ దుర్ఘట‌న‌లో 36 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. మ‌రో 15 మంది ఆచూకి తెలియ‌టం లేదు. ప్రమాదంలో గాయ‌ప‌డిన వారిని కేర్, కేజీహెచ్ ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు
 
హెచ్‌పిసిఎల్ కంపెనీలోని సీడీ-2 బ్లాక్ జరిగింది. ఒక్కసారిగా భారీ శ‌భ్దం నగ‌రం అంతా వినిపించింది. దాదాపు రెండు కిలొమీట‌ర్ల వ‌ర‌కు మంట‌లు క‌నిపించాయి.. 15 కిలీమీట‌ర్ల మేర పొగ వ్యాపించింది. ప్రమాదం త‌రువాత ఆ చుట్టు ప‌క్కల ర‌హాదారుల‌న్ని పోలిసులు నిలిపివేవారు దీంతో భారీగా ట్రాఫిక్ జావ అయింది. దీంతో స‌హాయ‌క చ‌ర్యల‌కు కూడా అవాంతరాలు ఎదుర‌య్యాయి.

బాధితులు మృతుల వివ‌రాలు తెలియ‌జేయాలంటూ వారి బంధువులు ఆందోళ‌న‌కు దిగ‌టంలో అక్కడ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. యాజ‌యాన్యం స‌రైన ప్రమాణాలు పాటించ‌క‌పోవ‌టం వ‌ల్లే ఈ ప్రమాదం జ‌రిగింద‌ని కార్మికులు ఆరోపిస్తున్నారు.