TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఆరుగురి మృతి

Published on: Sat Sep 20, 2014 11:37AM

 

లక్నోలోని ఓ బాణాసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్లాల్ గంజ్ ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్మాణానికి, క్రాకర్ల తయారీకి ఎలాంటి అనుమతులు లేనట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు.