TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి

Published on: Tue Jul 1, 2025 11:14AM

తమిళనాడు శివకాశిలోని ఓ  బాణసంచా ఫ్యాక్టరీలో  మంగళవారం (జూలై1)న జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం వద్ద దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.  

తెలంగాణలోని సంగారెడ్డి జల్లా  పాశమైలారం పారిశ్రామిక వాడలో  సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 45 మంది మరణించిన సంఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో ఫ్యాక్టీరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. శివకాశి పేలుడులో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.